Nizamabad: సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్

Nizamabad: హిందువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన అర్వింద్

Shashank Gullapelli
Published on: 17 April 2024 4:42 PM IST
MP Arvind Participated In Sri Rama Navami Celebrations
X

Nizamabad: సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్

Nizamabad: దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్‌లోని ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి మండలం పరిధిలోని ఖిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు పలువురు నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు ఎంపీ అర్వింద్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత తొలి సారి నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని తెలిపారాయన.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story