MP Arvind: మంత్రి కేటీఆర్ పై ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్

MP Arvind: వ్యాక్సినేషన్ పై కేటీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు-అర్వింద్ * తెలంగాణలో 17.8 శాతం వ్యాక్సిన్ వృథా అవుతుంది

Sandeep Eggoju
Published on: 8 Jun 2021 6:15 PM IST
MP Arvind Hot Comments on Minister KTR
X

ఎంపీ అరవింద్ (ఫైల్ ఇమేజ్)

MP Arvind: వ్యాక్సిన్ పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండి పడ్డారు. వ్యాక్సినేషన్ లో కేంద్రం వైఫల్యం ఉందంటూ కేటీఆర్ చేసిన ప్రకటనపై ధర్మపురి అర్వింద్ స్పందిస్తూ నిజాలు చెప్పడం నేర్చుకోవాలని చురకలంటించారు. దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా 17.8 శాతం వ్యాక్సిన్ వృధా అవుతందన్నారు. మార్చి 31 వరకు రాష్ర్టానికి 40 లక్షల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేస్తే..కేవలం 12 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వ్యాక్సిన్ మొదలైనప్పటి నుంచి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి సలహా ఇచ్చే స్దాయికి కేటీఆర్ ఇంకా ఎదగలేదని ఎద్దేవ చేశారు. తండ్రి, కొడుకులు రాత్రి ఏ టైంలో మాట్లాడుతున్నారో జాతీయ మీడియా గుర్తించాలని చురకలు అంటించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story