MP Arvind: మంత్రి ప్రశాంత్ రెడ్డి పై ఎంపీ అరవింద్‌ సంచలన ఆరోపణలు

MP Arvind: రోడ్లు భవనాల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న అరవింద్

Jyothi
Published on: 17 July 2023 11:18 AM IST
MP Arvind Comments On Prashanth Reddy
X

MP Arvind: మంత్రి ప్రశాంత్ రెడ్డి పై ఎంపీ అరవింద్‌ సంచలన ఆరోపణలు

MP Arvind: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రోడ్లు భవనాల శాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆరోపించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని,51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండలోనే చేపట్టారని వెల్లడించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story