Hyderabad: పోలీసులతో యువకుడి వాగ్వాదం.. ఆగ్రహంతో బైక్‌ను తగులబెట్టిన యువకుడు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలానాలపై వాహనదారుల ఆగ్రహం

Jyothi
Updated on: 3 Oct 2022 7:45 PM IST
Motorist Anger Over Traffic Challan in Hyderabad
X

Hyderabad: పోలీసులతో యువకుడి వాగ్వాదం.. ఆగ్రహంతో బైక్‌ను తగులబెట్టిన యువకుడు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చలాన్ల విధింపుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అమీర్‌పేట మైత్రీవనం వద్ద బైక్‌పై రాంగ్‌రూట్లో వస్తున్న యువకుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. బైక్‌పై పెండింగ్ చలాన్లను క్లియర్ చేయాలని చెప్పడంతో...తన బైక్‌ను తానే పెట్రోల్‌ పోసి తగులబెట్టుకున్నాడు యువకుడు అశోక్. విషయం తెలుసుకున్న పోలీసులు..మంటల్ని ఆర్పేసి కాలిపోయిన బైక్‌ను ట్రాలీలో తీసుకెళ్లారు. నడిరోడ్డుపై బైక్‌ను తగులబెట్టడంతో మైత్రీవనం దగ్గర కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Jyothi

Jyothi

Next Story