Peddapalli: కన్న కొడుకును బావిలో నెట్టేసిన తల్లి

Peddapalli: పెద్దపల్లి జిల్లా మొగల్‌పురలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 11:22 AM IST
Mother Throws his son Into Agricultural Well in Peddapalli
X

(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Peddapalli: పెద్దపల్లి జిల్లా మొగల్‌పురలో విషాదం చోటు చేసుకుంది. కన్న కొడుకును బావిలో నెట్టేసి చంపేసిందో తల్లి. యశ్వంత్‌ పుట్టుకతోనే మానసికస్థితి బాగాలేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అయితే ఆస్పత్రికి అంటూ తీసుకొచ్చి బావిలో తోసేసిందంటున్నారు. యశ్వంత్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొగల్‌పురాలో నివాసముంటే శ్యామల గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నది. కొడుకు యశ్వంత్‌ (14)ను సహజ కాలేజీ దగ్గరలోని వ్యవసాయ బావిలో తోసి వేసింది. అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. అయితే, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బావిలోకి తోసివేసినట్లు పేర్కొంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story