జనగామ చైన్‌ స్నాచింగ్‌ ఘటనలో కీలక మలుపు.. కన్నతల్లే కసాయి..!

Mother Drowns Infant Baby in Pool Jangaon
x

జనగామ చైన్‌ స్నాచింగ్‌ ఘటనలో కీలక మలుపు.. కన్నతల్లే కసాయి..! 

Highlights

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ జరిగిందంటూ ప్రచారం జరిగిన ఘటనలో కీలక మలుపు తిరిగింది.

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ జరిగిందంటూ ప్రచారం జరిగిన ఘటనలో కీలక మలుపు తిరిగింది. కన్నతల్లే బిడ్డను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంబేడ్కర్‌‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళ మెడలోంచి తాళిని అపహరించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో తన చేతిలో ఉన్న తన 10 నెలల బిడ్డను నీటి సంపులో పడేసి దుండగులు చంపారని ప్రసన్న తెలిపింది. అయితే విచారణలో పొంతనలేని సమాధానాలివ్వడంతో ఈ ఘటనలో తల్లే హంతకురాలని పోలీసులు అనుమానిస్తున్నారు. తన బిడ్డను తానే చంపేసి తమను తప్పుదారి పట్టిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

పాపకు అనారోగ్య సమస్యలు ఉండటం, ఎదుగుదల సరిగా లేకపోవడంతో చేజేతులా చంపేసినట్లు తెలిపింది. సెలూన్‌లో కూలీ పని చేసే భర్త భాస్కర్.. ఆ పాప చికిత్స కోసం ఇప్పటికే ఐదారు లక్షలు ఖర్చు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో భర్త పడే ఇబ్బంది చూడలేక, మానసిక ఒత్తిడికి గురై భార్య ప్రసన్న ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories