Top
logo

రేపు ఇంట్లో పెళ్లి..అంతలోనే విషాదం

రేపు ఇంట్లో పెళ్లి..అంతలోనే విషాదం
X
Highlights

ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగి తల్లి...

ఖమ్మం నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. విషం తాగి తల్లి గోవిందమ్మ, ఇద్దరు కూతుళ్లు రాధిక, రమ్య మృతి చెందారు. పెద్ద కుమార్తె రాధిక పెళ్లికి డబ్బు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో సూసైడ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవల వారి పెద్ద కుమార్తె రాధికకు వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 11న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో పెళ్లికి డబ్బు సర్దుబాటు కాలేదు. దీంతో మనస్తాపం చెంది తల్లి,ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇంట్లో ఉన్న బంగారం మెరుగు పెట్టేందుకు వినియోగించే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Web Titlemother and her 2 daughters commit suicide in Khammam
Next Story