నల్గొండలోని పద్మానగర్ కాలనీలో విషాదం.. ఇంట్లో గోడ కూలి తల్లీకూతుళ్ళ దుర్మరణం

Nalgonda:శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం

Rama Rao
Published on: 8 July 2022 11:07 AM IST
Mother and daughter Died in Nalgonda | Nalgonda News
X

నల్గొండలోని పద్మానగర్ కాలనీలో విషాదం.. ఇంట్లో గోడ కూలి తల్లీకూతుళ్ళ దుర్మరణం

Nalgonda: నల్గొండలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పద్మానగర్‌లోని ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా మీద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నడికుడి లక్ష్మీ ఆమె కూతురు కళ్యాణిగా గుర్తించారు. ఇటీవలే కళ్యాణికి వివాహం జరిగింది.

ఆ కుటుంబం కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Rama Rao

Rama Rao

Next Story