Hyderabad: భాగ్యనగరంలో దోమల బెడద

Mosquito infestation in Bhagyanagar
x

భాగ్యనగరంలో దోమల బెడద

Highlights

Bhagyanagar: *ఇప్పటి వరకు 158 డెంగ్యూ కేసుల నమోదు

Bhagyanagar: హైదరాబాద్‌లో డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. రెయినీ సీజన్‌ ఇంకా స్టార్ట్‌ కాకముందే.. డెంగ్యూ దోమలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను మంచనా పడేస్తున్నాయి. ఆస్పత్రి పాలు చేస్తున్నాయి.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొషన్‌ లో జనవరి నుంచి ఇప్పటి వరకు 158 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే డెంగ్యూ దోమలు హడలెత్తిస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో డెంగ్యూ ఫీవర్స్‌ మరింతగా పెరిగే ప్రమాదం ఉందని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డెరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో చెరువుల దుస్థితి కారణంగానే సమ్మర్‌లో డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగ్యూ మాత్రమే కాకుండా మలేరియా, టైఫాయిడ్ కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని... మంచి పౌష్ఠిక ఆహారం తినాలని,నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. జ్వరం వరుసగా మూడు రోజుల పైగా ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలని డాక్టర్ శ్రీమన్నారాయణ అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories