Hyderabad: హైదరాబాద్ లో కొత్త వైరస్..రోజుకు 200పైగా కేసులు నమోదు

Hyderabad: హైదరాబాద్ లో కొత్త వైరస్..రోజుకు 200పైగా కేసులు నమోదు
x
Highlights

Hyderabad: హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో రోజు పదుల సంఖ్యలో చిన్నారులు చేరుతున్నారు.

Hyderabad: కొన్నిరోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడుతున్న వేళ చలిగాలుల ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై పడుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో రోజు పదుల సంఖ్యలో చిన్నారులు చేరుతున్నారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. చల్లని గాలుల కారణంగా చిన్నారులు, ముసలివాళ్లు ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 200కి పైగా న్యూమోనియా కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. రోజూ ఓపీ విభాగంలో 30 నుంచి 40 మంది పిల్లలు వస్తున్నట్లు తెలిపారు. సోమ, మంగళ, బుధ వారాల్లో ఈ సంఖ్య 60కి పెరుగుతోంది. వీరిలో కొంతమందికి హెచ్ఎఫ్ఎన్ సీ, వెంటిలేటర్ చికిత్స అవసరం అవుతూందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని వైద్యులు వెల్లడించారు.

న్యూమోనియా ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాల ద్వారా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. రెస్పిరేటరీ సిన్సిటియర్ వైరస్, స్ట్రెప్టోకోకస్ , ఇన్ ఫ్లూయింజా వైరల్ వంటి సంక్రమణల కారణంగా 0 నుంచి 5 ఏళ్ల పిల్లలు 65ఏళ్లు పైబడిన వ్రుద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.

6నెలల చిన్నారులకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి. ఇది న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలకం. తీవ్ర జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, శరీరం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. చలిగాలుల బారిన పడకుండా ఉండేందుకు ఉన్ని దుస్తులు ధరించడంతోపాటు వేడి ఆహారం, గోరువెచ్చని నీరు ఇవ్వాలి. చలికాలంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యుల సూచనలు పాటించడం చాలా కీలకం. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories