ATM: కాసుల వర్షం.. రూ. 500 డ్రా చేస్తే రూ. 2000..ఖాతాదారులు క్యూ

ATM: వెయ్యి రూపాయల నగదు డ్రా చేసిన వారికి ఐదు వేల రూపాయలు వచ్చాయి

Samba Siva Rao
Published on: 15 May 2021 6:52 PM IST
More Money From ATM Cash Withdrawal In Vanaparty District
X

Representational Image

ATM: వనపర్తి జిల్లాలోని ఇండియా వన్ ఏటీఎంలో కాసుల వర్షం కురిసింది. అమరచింత మండల కేంద్రంలోని ఏటీఎం లో ఐదు వందల రూపాయలు డ్రా చేస్తే రెండు వేల రూపాయుల నగదు వచ్చాయి. వెయ్యి రూపాయల నగదు డ్రా చేసిన వారికి ఐదు వేల రూపాయలు వచ్చాయి. దీంతో ఒక్క సారిగా షాక్ గురైన ఖాతాదారులు వారి వారి స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించుకుని డ్రా చేయించారు. విషయం తెలుసుకున్న పలువురు ఖాతాదారులు ఏటీఎం దగ్గరకు చేరుకున్నారు. చుట్టుపక్కల షాపుల వాళ్లకు అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎం కేంద్రానికి చేరుకున్ పోలీసులు జనాన్ని పంపించి ఏటీఎంకు తాళం వేశారు. బ్యాంక్ సిబ్బందికి విషయం తెలియచేశారు. సాంకేతిక లోపంతో ఈ విధంగా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

మొత్తం రూ.5.88 లక్షలు అదనంగా డ్రా అయినట్లుగా గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగా ఈ విధంగా జరిగి ఉండొచ్చని వారు తెలిపారు. అయితే, జనం మాత్రం ఏటీఎంలో డబ్బు నింపేటప్పుడు రూ.100 నోట్ల కట్టలు పెట్టే స్థానంలో రూ.500 పెట్టి ఉంటారని చర్చించుకున్నారు

Samba Siva Rao

Samba Siva Rao

Next Story