Telangana News: న్యూ ఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు

Telangana News: 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం షాపులు ఓపెన్‌

Jyothi
Updated on: 30 Dec 2022 1:30 PM IST
More Kick to the New Year Celebrations
X

Telangana News: న్యూ ఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు

Telangana News: ఎప్పట్లాగే ఈ సారి కూడా న్యూఇయర్‌ వేడుకలకు మరింత కిక్కు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ప్రియుల కోసం వెసులుబాటు కల్పించింది. డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరిపేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు 31న అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి. ఇక, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, క్లబ్బులు, టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన హోటళ్లకు రాత్రి ఒంటి గంట వరకు పర్మిషన్ ఇచ్చాయి. ఈవెంట్‌ పర్మిషన్లు తీసుకున్న వారు కూడా ఒంటి గంట వరకు మద్యాన్ని సర్వ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే ఈవెంట్లలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Jyothi

Jyothi

Next Story