Kodangal Attack: లగచర్ల దాడిలో మరో 10 మంది అరెస్ట్

Kodangal Attack: లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో శనివారం మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2024 2:00 PM IST
More 10 Members Arrested In Lagacharla Incident
X

Kodangal Attack: లగచర్ల దాడిలో మరో 10 మంది అరెస్ట్

Kodangal Attack: లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో శనివారం మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 21కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి. సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయ్యారు. ఆయనను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరగనుంది. మరో వైపు నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ ను కేటాయించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.

వికారాబాద్ కలెక్టరేట్ కు మహేష్ భగవత్

వికారాబాద్ కలెక్టరేట్ కు శాంతిభద్రతల ఏడీజీ మహేష్ భగవత్ చేరుకున్నారు. లగచర్ల ఘటనకు ముందు జరిగిన పరిస్థితులను ఆరా తీశారు. ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగిందనే విషయాలను ఆరా తీశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story