మోరంచపల్లిలో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే.. వరద తగ్గడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్న మృతదేహాలు..

Moranchapalli: భారీ వరదలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలకు కన్నీటి వ్యథను మిగిల్చాయి.

Arun Chilukuri
Published on: 29 July 2023 3:36 PM IST
Moranchapalli Village Situation After Decreasing Of Flood
X

మోరంచపల్లిలో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే.. వరద తగ్గడంతో ఒక్కొక్కటిగా బయటపడుతున్న మృతదేహాలు

Moranchapalli: భారీ వరదలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలకు కన్నీటి వ్యథను మిగిల్చాయి. తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగడంతో ఆ ఊరు మొత్తం వరదలో మునిగిపోయింది. గ్రామ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. సాయం కోసం ఎదురు చూస్తూ ఆర్తనాదాలు చేశారు. వరద బీభత్సానికి అప్పటికే పలువురు కొట్టుకుపోయారు. మోరంచవాగు వరద తగ్గడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది. దీంతో.. మోరంచపల్లిలో ఎక్కడ చూసినా విషాద దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఇళ్ల ముందు కట్టెలకు కట్టేసిన పశువులు.. అలాగే చనిపోయి పడి ఉండటం అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story