వారి పెళ్లికి వానరమే విశిష్ట అతిథి !

వారి పెళ్లికి వానరమే విశిష్ట అతిథి !
x
Highlights

పెళ్లంటే నూరేళ్ల పంట బంధు మిత్రులు, భాజాభజంత్రిలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాని కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే...

పెళ్లంటే నూరేళ్ల పంట బంధు మిత్రులు, భాజాభజంత్రిలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కాని కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో ఓ వానరం(కోతి) తానే విశిష్ట అతిథి అయ్యింది. నూతన జంట తలంబ్రాల సందర్భంగా తాను చేయి కలిపి మనసారా ఆశీర్వదించింది. ఈ అరుదైన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో జరిగింది.

వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామానికి చెందిన బోదెబోయిన భరత్ కుమార్- నాగమణి వధువరుల వివాహం ఈ ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకను ఇరు కుటుంబాల పెద్దలు శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నిరాడంబరంగా కల్యాణం జరిపించారు. అయితే అనూహ్యంగా ఈ పెళ్లి వేడుకలో ఒక వానరం హల్ చల్ చేసింది. అతిథులు అందరితో కూర్చుని మాటా ముచ్చట కలిపిన ఆ వానరం అక్షింతలు పడే సమయంలో అందరిని ఆశ్చర్య పరిచింది. అందరూ ఏం జరిగిందో తేరుకునేలోపే వానరం వధూవరుల తల పైకి ఎక్కి వారిని ఆశీర్వదించి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories