School Holiday in Hyderabad: భారీ వర్షాలు.. పాఠశాలలకు సోమవారం సెలవు

School Holiday in Hyderabad
x

School Holiday in Hyderabad

Highlights

School Holiday in Hyderabad: హైదరాబాద్‌లోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

School Holiday in Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా హైదారబాద్ వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ క్రమంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. దీంతో హైదరాబాద్‌లోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లకు సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ నుంచి ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆర్‌అండ్‌బీ శాఖలతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

అలాగే, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌ నంబర్లకు 040-23202813, 9063423979 ఫోన్ చేయాలని, అలాగే ఆర్డీవో నంబర్ 7416818610, 9985117660లకు సికింద్రాబాద్ ఆర్డీవోకు 8019747481లకు ఫోన్‌ చేచాలపి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories