వైరల్‌ అవుతున్న మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ సంభాషణలు

Moinabad farm house conversation going viral
x

వైరల్‌ అవుతున్న మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ సంభాషణలు

Highlights

* తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని రోహిత్‌రెడ్డి సంభాషణ

Farm house Episode: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ వ్యవహారంలో ఓ ఫోన్‌ సంభాషణ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, నందు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బీజేపీలోకి రావడానికి లైన్‌క్లియర్‌ చేయిస్తానని రోహిత్‌రెడ్డికి స్వామీజీ చెబుతున్నట్టు ఆడియోలో ఉంది. బీజేపీలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడతానని, ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా తాను చూసుకుంటానని రోహిత్‌రెడ్డికి స్వామీజీ భరోసా కల్పిస్తున్నట్టు ఈ సంభాషణ ఉంది.

అయితే.. తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని స్వామీజీకి రోహిత్‌రెడ్డి చెప్పారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు నెంబర్‌-2 ముందు కూర్చున్నప్పుడు రివీల్‌ చేస్తానన్నారు రోహిత్‌రెడ్డి.ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లో చర్చిద్దామని ఆయన అన్నట్టు ఆడియోలో ఉంది. అయితే.. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లో కాకుండా వేరే రాష్ట్రంలో చర్చిద్దామని స్వామీజీ అన్నట్టు ఫోన్‌ సంభాషణలో ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories