యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం

Narendra Modi: ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన ఎన్నికల ప్రచార సభను తలపించింది.

Arun Chilukuri
Updated on: 26 May 2022 5:58 PM IST
Modi Targets KCR, Ask People to end Family Rule
X

యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం

Narendra Modi: ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన ఎన్నికల ప్రచార సభను తలపించింది. కేసీఆర్ సర్కార్‌పై, టీఆర్ఎస్ పార్టీపై, కల్వకుంట్ల కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పొలిటికల్ పంచ్‌లు హీట్ పుట్టించాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇస్తూ సాగిన ఆయన పర్యటన టీఆర్ఎస్‌పై యుద్ధాన్ని చెప్పకనే చెప్పినట్లైందనే టాక్ వస్తోంది. తెలంగాణ పోరాట పుట్టుపూర్వోత్తరాలు, తెలంగాణ చరిత్రలో సర్దార్ వల్లబ్ బాయ్ అధ్యాయం గురించి ప్రధాని మాట్లాడటం, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి ప్రభుత్వం కావాలో అన్నీ ఒక్క ముక్కలో చెప్పడం చూసిన కాషాయ కార్యకర్తలు ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన గులాబీ దళంపై యుద్ధాన్ని ప్రకటించడమే అని అనుకుంటున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story