Adilabad: పెళ్లిపత్రికపై ప్రధాని మోడీ, బండి సంజయ్ ఫొటోలు

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న కార్యకర్త

Jyothi
Published on: 12 May 2023 12:24 PM IST
Modi and Bandi Sanjay Photos in Wedding Card
X

Adilabad: పెళ్లిపత్రికపై ప్రధాని మోడీ, బండి సంజయ్ ఫొటోలు

Adilabad: అవధుల్లేని అభిమానం తన పెళ్లిపత్రికపై కూడా చూపించాడో అభిమాని. తాను ఆరాధించే వ్యక్తుల ఫొటోలను పెళ్లి పత్రికపై ప్రింట్ చేయించుకున్నాడు ఆ అభిమాని. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన శ్రీకాంత్, జగిత్యాల జిల్లాకు చెందిన ఆద్య వివాహం ఈనెల 14న జరగనుంది. అయితే వరుడు శ్రీకాంత్ బీజేపీ కార్యకర్త కావడంతో పెళ్లి పత్రికపై ప్రధాని మోడీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫొటోలు ప్రచురించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రికపై ఫొటోలు వైరల్‌గా మారాయి.

Jyothi

Jyothi

Next Story