Weather Report: తెలంగాణలో రాబోయే 3రోజుల్లో మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Weather Report: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Shekhar G
Published on: 26 Jun 2023 6:33 PM IST
Moderate Rains In Telangana For The Next 3 Days
X

Weather Report: తెలంగాణలో రాబోయే 3రోజుల్లో మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

Weather Report: తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు పడే ఛాన్సుందన్నారు. అలాగే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని తెలిపింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్సుందని వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story