Telangana: కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు- పల్లా

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 24 May 2021 4:48 PM IST
MLC Palla Rajeshwar Reddy Slams Bandi Sanjay
X

పల్లా రాజేశ్వర్‌రెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బఫూన్‌లా ప్రవర్తిస్తున్నారంటూ బండి సంజయ్‌పై ఘాటు వ్యాఖ‌్యలు చేశారు. దేశంలో ఎక్కడా చేయని విధంగా తమ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకునేది లేదంటూ బండి సంజయ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇఛ్చారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయరని చెప్పారు. సీఎం కరోనా బాధితులకు అండగా ఉంటున్నారని, ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనా బాధితులకు ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత లేకుండా చేస్తున్నామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story