Palla Rajeshwar Reddy: బీజేపీ తెలంగాణ నేతలకు వరికి గోధుములకు తేడా తెలవదు

Palla Rajeshwar Reddy: ఉద్యమంలో కనిపించని బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు

Rama Rao
Updated on: 12 April 2022 5:30 PM IST
MLC Palla Rajeshwar Reddy Comments on BJP Chief Bandi Sanjay
X

Palla Rajeshwar Reddy: బీజేపీ తెలంగాణ నేతలకు వరికి గోధుములకు తేడా తెలవదు

Palla Rajeshwar Reddy: ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ నేతలను పిలిపించుకొని క్లాస్ తీసుకున్నప్పటికీ చిల్లరమాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తర భారత దేశం నాయకుల కాళ్లవేళ్ల పడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు దమ్ముంటే ధాన్యం కొనుగోలు చేయించాలన్నారు. బండి సంజయ్ సోయి తప్పి మాట్లాడుతున్నారని బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. బీజేపీ ఒక్క మాట అంటే తాము పది మాటలు అంటామన్నారు. ఇంత కాలం ఓపిక పట్టాం ఇక నుంచి రైతులు ప్రజలు ఉరికిచ్చి కొడుతారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story