MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉంది

MLC Kavitha: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది

Dhatripriya
Published on: 2 April 2023 2:34 PM IST
MLC Kavithas Tweet About Umemployment
X

MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉంది

MLC Kavitha: కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని.., ఇది మూడు నెలల గరిష్ట స్థాయి అంటూ కవిత ట్వీట్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రశ్నించారు. మోసపూరిత హామీతో యువతను దగా చేశారు అంటూ ఫైరయ్యారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని నిలదీశారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదన్నారామె. ఇవాళ భారతదేశంలో వాస్తవం ఏంటంటే... నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ... డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందని విమర్శించారు. యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా లేదా యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కృషి ఏమైనా చేస్తున్నారా అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.



Dhatripriya

Dhatripriya

Next Story