Top
logo

తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : ఎమ్మెల్సీ కవిత
X
Highlights

తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మను...

తెలంగాణ ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మను ఎంతో సందడిగా చేసుకునేవాళ్లమని కానీ ఈ ఏడాది కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. వరదల‌ కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా 550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం అన్నారు కవిత. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


Web TitleMLC Kavitha wishing Saddula Bathukamma festival to Telangana people
Next Story