కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్‌కు ఎమ్మెల్సీ కవిత ట్వీట్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్‌కు ఎమ్మెల్సీ కవిత ట్వీట్
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్‌ల మధ్య ట్వీట్టర్ వేదికగా వాగ్వాదం...

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్‌ల మధ్య ట్వీట్టర్ వేదికగా వాగ్వాదం జరుగుతోంది. కేంద్రానికి కేసీఆర్ ఏటీఎం లాంటి వారని మాణిక్యం చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటైన ట్వీట్ చేశారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు పదాలు జాగ్రత్తగా వాడాలంటూ హెచ్చరిక చేశారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ వచ్చి సపోర్ట్ చేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ఇచ్చిన పదివేల సాయాన్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి అధికారిక లేఖ ఎందుకు ఇచ్చిందో హైదరాబాద్‌ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories