MLC Kavitha: కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థునుల భద్రత గాల్లో దీపంగా మారుతుంది

MLC Kavitha: అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరి పట్టుకొని.. పోలీసులకు అప్పగించిన వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నా

Shekhar G
Published on: 27 Jan 2024 4:30 PM IST
MLC Kavitha Tweet Osmania PG Ladies Hostel Incident
X

MLC Kavitha: కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థునుల భద్రత గాల్లో దీపంగా మారుతుంది

MLC Kavitha: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌లో ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థునుల భద్రత గాల్లో దీపంగా మారుతుందని చెప్పేందుకు సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌ లేడీస్‌ హాస్టల్‌ ఘటనే నిదర్శనమని అన్నారు. ఇటీవలే ఓయూ లోని ఉమెన్స్‌ హాస్టల్‌ వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే సికింద్రాబాద్‌ పీజీ కాలేజ్‌ హాస్టల్‌లో ఆగంతకులు చొరబడ్డారని మండిపడ్డారు.

అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరి పట్టుకొని పోలీసులకు అప్పగించిన వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌లో తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story