MLC Kavitha: ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌, ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై విచారణ

Jyothi
Published on: 26 March 2024 11:57 AM IST
MLC Kavitha to Delhi Rouse Avenue Court
X

MLC Kavitha: ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బెయిల్ పిటిషన్ తో పాటు.. ఈడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో.. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. మరో వారం రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది.

అయితే.. ఇప్పటికే 10 రోజుల పాటు రెండు విడతలుగా కవితను కస్టడీకి తీసుకున్న ఈడీ.. పలు కోణాల్లో విచారించింది. 10 రోజుల కస్టడీలో కవితతో పాటు ఇతరులను కలిపి ప్రశ్నించింది. ఈ విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించారు ఈడీ అధికారులు.

Jyothi

Jyothi

Next Story