MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అనారోగ్యం కారణంగా యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న రోడ్లు, భవనాల శా‌ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

Shekhar G
Published on: 13 Dec 2023 3:48 PM IST
MLC Kavitha Talk With Minister Komatireddy Venkat Reddy In Hospital
X

MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అనారోగ్యం కారణంగా యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న రోడ్లు, భవనాల శా‌ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. కాగా, మంత్రి వెంకట్‌రెడ్డి కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న ఢిల్లీ నుంచి తిరిగి రాగానే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. మంత్రికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు..రెండు రోజులు దవాఖానలోనే ఉండాలని సూచించారు. దీంతో ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story