Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

Kondagattu Temple: హనుమాన్‌ జయంతికి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్‌ నామస్మరణ పెద్దఎత్తున చేస్తామని కవిత స్పష్టం చేశారు.

Kranthi
Published on: 26 Feb 2021 9:08 AM IST
MLC Kavitha Special Worship at Kondagattu Temple
X

ఫైల్ ఇమేజ్


Kariminagar:తెలంగాణలో అధికార గులాబీ పార్టీ గేర్‌ మార్చింది. హిందుత్వంతో వెళ్తున్న బీజేపీకి బ్రేకులు వేసేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. యాగాలు చేస్తూ అతిపెద్ద హిందువుగా అభివర్ణించుకుంటూ బీజేపీకి ధీటుగా సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా దేవాలయల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని తమ ప్రసంగాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు .

ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు.. రాబోయే హనుమాన్‌ జయంతికి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్‌ నామస్మరణ పెద్దఎత్తున చేపడతామని స్పష్టం చేశారు. మండలం కాలం పాటు అంటే.. 41 రోజుల పాటు హనుమాన్‌ నామస్మరణ, హనుమాన్‌ చాలీసా పారాయణం చేయనున్నట్టు ప్రకటించారు కవిత. కొండగట్టు క్షేత్రంలో చిన్న హనుమాన్‌, పెద్ద హనుమాన్‌ జయంతి మధ్యకాలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కవిత తెలిపారు. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జై శ్రీరాం నినాదంతో పాటు.. జై హనుమాన్‌ నామస్మరణ కూడా వినబోతునట్టు తెలుస్తోంది.

Kranthi

Kranthi

Next Story