MLC Kavitha: రేవంత్‌ శవాల మీద పేలాలు ఏరుకునే రకం..

MLC Kavitha: నిరుద్యోగుల ఆత్మహ్యలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిప్పికొట్టారు.

Arun Chilukuri
Published on: 14 Oct 2023 3:18 PM IST
MLC Kavitha Slams Revanth Reddy
X

MLC Kavitha: రేవంత్‌ శవాల మీద పేలాలు ఏరుకునే రకం..

MLC Kavitha: నిరుద్యోగుల ఆత్మహ్యలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిప్పికొట్టారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయకుండా రాజకీయం చేయడం ఏమిటని కవిత ట్వీట్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని కవిత ఆరోపించారు. ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందన్నారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో డిమాండ్ చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు.

ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం అంటూ కవిత మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story