MLC Kavitha: తెలంగాణ పర్యటనకు మోడీని స్వాగతిస్తాం.. అసదుద్దీన్‌పై రాహుల్ గాంధీ గెలువడం కష్టమే..

తాను పోరాటం చేయడంతోనే మహిళా బిల్లు తెచ్చారు - ఎమ్మెల్సీ కవిత

Shekhar G
Updated on: 28 Sept 2023 8:31 PM IST
MLC Kavitha: తెలంగాణ పర్యటనకు మోడీని స్వాగతిస్తాం.. అసదుద్దీన్‌పై రాహుల్ గాంధీ గెలువడం కష్టమే..
X

MLC Kavitha: చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల అమలు జాప్యంపై MLC కవిత ఫైరయ్యారు. మహిళా బిల్లు కోసం తాను పోరాటం చేయడంతో బిల్లు తేవడం బీజేపీకి అనివార్యమయ్యిందన్నారు. మోడీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తామని.. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పట్ల మోడీ సభలో, బయట అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయని విమర్శించారు. రాహుల్‌కు అసదుద్దీన్‌ సవాల్‌ను సమర్ధిస్తూనే అసద్‌పై రాహుల్ గెలవడం కష్టమన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ రాజధాని.. దేశరాజధాని కాదు.. అందుకే తెలంగాణలో టీడీపీ ధర్నాలను వ్యతిరేకిస్తున్నామని చురకలంటించారు.

Shekhar G

Shekhar G

Next Story