MLC Kavitha: క‌ళ్ల నుంచి నీళ్లు కాదు.. నిప్పులు వ‌స్తాయి.. రెస్ట్ తీసుకునేది లేదు..

MLC Kavitha: దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Arun Chilukuri
Updated on: 12 Dec 2022 8:15 PM IST
MLC Kavitha Slams BJP in Telangana Jagruthi Meeting
X

MLC Kavitha: క‌ళ్ల నుంచి నీళ్లు కాదు.. నిప్పులు వ‌స్తాయి.. రెస్ట్ తీసుకునేది లేదు..

MLC Kavitha: దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ముషీరాబాద్‌లో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రశ్నిస్తే సీబీఐ. ఈడీల పేరుతో దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న కవిత.. తెలంగాణ ఆడపిల్ల కళ్లలోంచి నీళ్లు కావు నిప్పులు వస్తాయన్నారు. ఉద్యమ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన జాగృతి సంస్థను జన జాగృతిగా దేశ వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కుట్రలను బహిర్గతం చేస్తూ ప్రజలు, మేధావులు, కవులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో కొత్త కమిటీలు వేసి దేశవ్యాప్తంగా జాగృతి సంస్థను విస్తృతం చేస్తామన్నారు. రెస్ట్ లేదు.. రిలాక్స్ అయ్యేది లేదు ఏడాదికాలంలో దేశవ్యాప్తంగా జాగృతి సంస్థను విస్తృతపరిచి వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కవిత.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story