MLC Kavitha: నాకు ఎలాంటి నోటీసులు రాలేదు..ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు

*ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

Rama Rao
Published on: 16 Sept 2022 5:10 PM IST
MLC Kavitha Reacts to the Campaign of ED Notices
X

ఈడీ నోటీసుల ప్రచారంపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు తనకు నోటీసులు జారీ చేసినట్టు వచ్చిన వార్తలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని స్పష్టంచేశారు. దిల్లీలో కూర్చొని కొందరు దురుద్దేశపూర్వకంగా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాల్ని చూపించేందుకు ఉపయోగించాలని ట్విటర్‌లో కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు తనకెలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేయదలచుకున్నానంటూ కవిత పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story