MLC Kavitha: లండన్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. హీత్రూ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు

MLC Kavitha: రెండు రోజుల పర్యటనకు లండన్‌ వెళ్లిన కవిత

Jyothi
Published on: 6 Oct 2023 1:59 PM IST
MLC Kavitha Reached in London
X

MLC Kavitha: లండన్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. హీత్రూ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు

MLC Kavitha: లండన్‌ హీత్రూ విమానాశ్రయంలో ఎన్నారైలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఫ్లవర్ బుకేస్‌తో వెల్‌కమ్ చెప్పారు. భారత్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహిస్తున్న సమావేశంలో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్నారైలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరుకానున్నారు. లండన్ లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కవిత సందర్శిస్తారు. ఇక రేపు ఎన్ఐఎస్ఏయూ ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story