ట్విటర్ వేదికగా రాహుల్‌కి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు

*పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను.. ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్

Rama Rao
Published on: 6 May 2022 11:36 AM IST
MLC Kavitha Questions for Rahul Gandhi on Twitter
X

ట్విటర్ వేదికగా రాహుల్‌కి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు

Kavitha Tweet: తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరాతీసి.. అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండని ట్వీటర్ వేదికగా తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story