MLC Kavitha: మహిళా బిల్లుపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు..? సోనియాకు కవిత సూటి ప్రశ్న

MLC Kavitha: అందులో మహిళా బిల్లు అంశం లేకపోవడాన్ని తప్పుబట్టిన కవిత

Shekhar G
Published on: 6 Sept 2023 6:07 PM IST
Mlc Kavitha Question To Sonia Gandhi Over Women Reservation Bill
X

MLC Kavitha: మహిళా బిల్లుపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు..? సోనియాకు కవిత సూటి ప్రశ్న

MLC Kavitha:మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా అని ప్రశ్నించారు కవిత. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. అందులో మహిళా బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు.


Shekhar G

Shekhar G

Next Story