MLC Kavitha: మా అమ్మను కలిసేందుకు అనుమతించండని కవిత పిటీషన్

MLC Kavitha: కవిత అభ్యర్థనను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్ట్

Shashank Gullapelli
Published on: 19 March 2024 4:32 PM IST
MLC Kavitha Petition In Rouse Avenue Court
X

MLC Kavitha: మా అమ్మను కలిసేందుకు అనుమతించండని కవిత పిటీషన్ 

MLC Kavitha: మనీలాండరింగ్ కేసులో నాలుగు రోజుల క్రితం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖాలు చేశారు. తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతించాలని కోర్టుకు అభ్యర్థించారు. కవిత అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తల్లితోపాటు కుమారులను కలుసుకునేందుకు కూడా అనుమతించింది. తల్లి శోభ కుమారులను కలుసుకునేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించడంతో.. కస్టడీలో ఉన్న ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు.. బంధువులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story