సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం: ఎమ్మెల్సీ కవిత

Arun Chilukuri
Published on: 15 Feb 2021 3:05 PM IST
సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం: ఎమ్మెల్సీ కవిత
X

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం: ఎమ్మెల్సీ కవిత

గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ అని అన్నారు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌లోని తారకరామ్ నగర్ కాలనీలో సేవాలాల్ 282 వ జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. కవితకు బంజారా మహిళలు తమ సాంప్రదాయ నృత్యంతో ఘనస్వాగతం పలికారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని, సీఎం కేసీఆర్‌కు బంజారాల పట్ల అపారమైన గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని అన్నారు కవిత.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story