MLC Kavitha: బీజేపీని గద్దెదించాలన్న ఒక్క ఎజెండాతోనే ఇండియా కూటమి

MLC Kavitha: దేశమంతా తెలంగాణ అభివృద్ధి మోడల్ అమలు కావాలి

Shekhar G
Published on: 13 Oct 2023 8:49 AM IST
MLC Kavitha Participated In The Southern Rising Summit Organized In Chennai
X

MLC Kavitha: బీజేపీని గద్దెదించాలన్న ఒక్క ఎజెండాతోనే ఇండియా కూటమి

MLC Kavitha: దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు BRS ఎమ్మెల్సీ కవిత. కులగణన చేపట్టకపోవడంలో బీజేపీ, కాంగ్రెస్‌లది సమాన పాత్ర అన్నారు. చెన్నైలో నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న కవిత.. బీజేపీని గద్దెదించాలన్నది కాకుండా.. ప్రజల కోసం ఇండియా కూటమి ఎజెండా ఏంటని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది శూన్యమన్న కవిత.. దక్షిణాదిలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. 75 ఏళ్ల కాలంలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదని.. అందుకే జాతీయ స్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని తమ పార్టీ భావిస్తోందన్నారు. తెలంగాణలో అందించిన పాలనను దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు. దేశమంతా తెలంగాణ అభివృద్ధి మోడల్ అమలు కావాలని ఆకాంక్షించారు.

Shekhar G

Shekhar G

Next Story