MLC Kavitha: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్

MLC Kavitha: కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకోవాలి

Jyothi
Published on: 7 Jun 2023 1:19 PM IST
MLC Kavitha Participated in Irrigation Day at New Ambedkar Bhavan in Nizamabad
X

MLC Kavitha: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్

MLC Kavitha: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో సాగునీటి దినోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story