అర్వింద్.. 24 గంటల సమయం ఇస్తున్నా.. రుజువు చేయకపోతే.. పులాంగ్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాయాలి..

MLC Kavitha: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

Jyothi
Published on: 21 July 2023 2:21 PM IST
MLC Kavitha Fire On MP Arvind
X

MLC Kavitha: అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ప్రచారం చేసి ముందుండి ఓడిస్తా

MLC Kavitha: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ప్రచారం చేసి ముందుండి ఓడిస్తానన్నారు. కమీషన్లు తీసుకున్న విషయాన్ని.. 24 గంటల్లో రుజువు చేయకపోతే.. నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. తమతో పెట్టుకుంటే బాగుండదని.. రాజకీయాల్లో లేని తన భర్త పేరెందుకు తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ అర్వింద్ అతిగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని.. ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి కాదు.. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీగా ఉండి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలన్నారు.

Jyothi

Jyothi

Next Story