MLC Kavitha: సీఎం కేసీఆర్ భరోసా.. ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..

MLC Kavitha Left for Delhi After KCR’s Phone Call
x

MLC Kavitha: సీఎం కేసీఆర్ భరోసా.. ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..

Highlights

MLC Kavitha: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరారు.

MLC Kavitha: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరారు. ఈనెల 10న జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈడీ నోటీసులపై ప్రగతిభవన్ కు వెళ్లి సీఎంతో చర్చించాలని భావించారు కవిత. కేసీఆర్ తో న్యాయసలహా తీసుకుని ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. అయితే తన షెడ్యూల్ మార్చుకున్న కవిత నేరుగా ఢిల్లీకే వెళ్తున్నారు. ముందుగా ఢిల్లీ ప్రయాణంపై సందిగ్ధంలో ఉన్న కవితకు.. సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. నీ కార్యక్రమాలు నువ్వు కొనసాగించమని తెలిపారు. కవితతో ఫోన్‌లో మాట్లాడే సందర్భంలో పార్టీ అండగా ఉంటుంది ఆందోళన వద్దన్న కేసీఆర్‌.. బీజేపీపై న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు.

లిక్కర్ స్కామ్‌లో నిన్న రిమాండ్ ‌రిపోర్టు ఇచ్చిన ఈడీ అందులో కవిత పేరును ప్రస్తావించింది. పిళ్లై కవితకు బినామీని అని ఒప్పుకున్నట్లు రిపోర్టులో తెలిపిన ఈడీ.. కవితకు నోటీసులిచ్చింది. ఈనెల 9న విచారణకు హాజరుకావాలని తెలిపారు. అయితే జంతర్ మంతర్ దగ్గర ధర్నా నేపథ్యంలో ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని ఈడీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు కవిత. అయితే కవిత విజ్ఞప్తిపై ఈడీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే కేసీఆర్ భరోసాతో నేరుగా ఢిల్లీకే వెళ్లారు కవిత.

రామచంద్ర పిళ్లై కవితకు బినామీనంటూ ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పిళ్లైతో కలిపి ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కూడా డిసెంబర్ లో ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. పిళ్ళైను వారం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైను విచారిస్తామని కోర్టుకు తెలిపింది ఈడీ. ఇదిలా ఉంటే సౌత్ గ్రూప్ నుంచి కోట్ల రూపాయలు ఆప్ కు చేరవేయడంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కీలక పాత్ర పోషించాడని, ఆయన కవితకు బినామీ అని ఈడీ చెబుతోంది. ఈ మేరకు నిందితుల స్టేట్ మెంట్లు బలం చేకూరుస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది ఈడీ.

అయితే ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. లిక్కర్ స్కామ్ లో తాను చేసింది ఏమీ లేదని, తాను దేనికీ భయపడబోనని తెలిపారు. తనకు నోటీసులు వచ్చాయని చట్టాన్ని గౌరవిస్తా దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. కానీ, ఢిల్లీలో 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా కారణంగా విచారణకు హాజరుపై... ఈడీ ఎదుట హాజరుకు సమయం కోరతానని.. అవసరమైన న్యాయ సలహా తీసుకుంటా అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బిజెపి తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానన్న కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరిస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories