MLC Kavitha: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్.. అక్రమ అరెస్టుపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌

MLC Kavitha: కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్న అనిల్‌

Jyothi
Published on: 18 March 2024 8:01 AM IST
MLC Kavitha Husband Anil To Challenge Arrest In Supreme Court
X

MLC Kavitha: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్.. అక్రమ అరెస్టుపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు. ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం నిబంధనలను విరుద్ధమని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు. కవిత తరుపున సీనియర్‌ లాయర్లు కపిల్‌ సిబాల్‌, రోహిత్గీ వాదనలు విన్పిస్తారని సమాచారం.

Jyothi

Jyothi

Next Story