మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటిన ఎమ్మెల్సీ కవిత

Arun Chilukuri
Published on: 28 Feb 2021 2:57 PM IST
మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటిన ఎమ్మెల్సీ కవిత
X

మరోసారి తన‌ సేవాగుణాన్ని చాటిన ఎమ్మెల్సీ కవిత

చైనా లోన్ అప్లికేషన్‌ల వేధింపులకు బలైన కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత బాసటగా నిలిచారు. ఉద్యోగంతో పాటు, ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించే బాధ్యతను తీసుకుంటానని కవిత హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన చంద్రమోహన్, చైనా లోన్ అప్లికేషన్ ల వేధింపులను భరించలేక జనవరి నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రమోహన్ భార్య సరిత, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, చంద్రమోహన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చిన కవిత, పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించేవరకూ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story