MLC Kavitha: యూకే పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో తెలంగాణ మోడల్‌పై ప్రసంగించనున్న కవిత

Jyothi
Updated on: 30 Oct 2023 7:26 AM IST
MLC Kavitha for UK Tour
X

MLC Kavitha: యూకే పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: తెలంగాణ ఎమ్మెల్సీ కవిత యూకేలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు.. కవిత యూకే బయలుదేరారు. ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్...ది తెలంగాణ మోడల్" అనే అంశంపై ప్రసంగించనున్న కవిత.. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇవాళ కీలక ఉపన్యాసం చేయనున్నారు.

పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు అంశాలపై కవిత ప్రసంగించనున్నారు.

Jyothi

Jyothi

Next Story