MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా?

MLC Kavitha: ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు.. కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా?

Jyothi
Published on: 17 Nov 2023 11:53 AM IST
MLC Kavitha Fire On Congress
X

MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు.. క్షమాపణలకు బంట్రోతులా?

MLC Kavitha: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ డైలాగ్ వార్ ముదురుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీల మాటల దాడి పీక్స్ కు చేరుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడిన అంశంపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. సోనియా, రాహుల్‌ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా కల్వకుంట్ల కవిత ఆక్షేపించారు.

Jyothi

Jyothi

Next Story