Kavitha: మేం విచారణకు హాజరు కావాలి కానీ... బీజేపీ వాళ్లు రారా..?

Kavitha: తప్పు చేసిన వారే భయపడతారు

Jyothi
Updated on: 23 Nov 2022 4:01 PM IST
MLC Kavitha Fire On BJP
X

Kavitha: మేం విచారణకు హాజరు కావాలి కానీ... బీజేపీ వాళ్లు రారా..? 

Kavitha: బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈడీ ఐటీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేసిన వారే భయ పడతారని అన్నారు. మేం విచారణకు హాజరు కావాలి కానీ... బీజేపీ వాళ్లు రారా అని ప్రశ్నించారు.

కాగా, నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. బీఎల్‌ సంతోష్‌ విచారణకు రమ్మంటే కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడంలేదు. నిన్న సభ పెట్టి బండి సంజయ్‌ కన్నీరుపెట్టుకున్నారో అర్థం కాలేదు. తప్పు చేయకపోతే భయమెందుకు?. దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరు. విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తాము అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story