MLC Kavitha: ఇవాళ్టితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

MLC Kavitha: లిక్కర్ స్కాంలో ఆరు ఈడీ కస్టడీలో ఉన్న కవిత

Jyothi
Published on: 23 March 2024 8:26 AM IST
MLC Kavitha ED Custody Will End Today
X

MLC Kavitha: ఇవాళ్టితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కస్టడీ ఇవాల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌసౌ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల 15 హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. గత ఆరు రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది.

ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కాం కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికి వస్తానని, బాధ పడవద్దు అంటూ ధైర్యం చెప్పారు.

Jyothi

Jyothi

Next Story