MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

MLC Kavitha: ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ అధికారులు

Jyothi
Published on: 26 March 2024 8:34 AM IST
MLC Kavitha ED Custody in Delhi Liquor Case will end today
X

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. కవితను ఇప్పటికే 10 రోజుల పాటు రెండు విడతలుగా కస్టడీకి తీసుకున్న ఈడీ.. పలు కోణాల్లో విచారించింది. 10 రోజుల కస్టడీలో కవితతో పాటు ఇతరులను కలిపి ప్రశ్నించింది. ఈ విచారణకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించనున్నారు ఈడీ అధికారులు. ఇవాళ కవితను కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ.. మరో వారం రోజుల పాటు కస్టడీకి అడిగే అవకాశం ఉంది. కవితను ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించని పక్షంలో.. జ్యుడీషియల్‌ కస్టడీకి ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. తీహార్‌ జైలుకు కవితను తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Jyothi

Jyothi

Next Story