MLC Kavitha: తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వ వివక్షత..

MLC Kavitha: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 17 Feb 2023 7:25 AM IST
MLC Kavitha Counter To Nirmala Sitharaman
X

MLC Kavitha: తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వ వివక్షత..

MLC Kavitha: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గణాంకాలతోసహా తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. దీంతో స్పందించిన కవిత తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత.. కొత్త జిల్లాలను విస్తరించుకోవడంతో మెడికల్ కళాశాలకోసం చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు, కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలకు దరిదాపుల్లో లేకపోవడంతో వైద్య కళాశాలల మంజూరు విషయంలో తెలంగాణకు వివక్షత గురైందనే విషయాన్ని ప్రస్తావించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story